CM to Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.
పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని నిన్న రాష్ట్రానికి చేరుకున్న సిఎం జగన్ నేడు స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం అయన ఢిల్లీ బయల్దేరే అవకాశాలున్నాయి. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సిఎం కలుసుకునే అవకాశం ఉంది.