Wednesday, March 11, 2026
HomeTrending Newsముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నేడు కదిరి పట్టణంలో జరిగిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొన్నారు.

అంతకుముందు కదిరి పట్టణంలో జగన్ కు అఖండ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్ కు నీరాజనం పలికారు. అశేష జనవాహిని మధ్య రోడ్ షో నెమ్మదిగా సాగడంతో గంటన్నర ఆలస్యంగా జగన్ ఇఫ్తార్ జరుగుతున్న ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular