Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సిఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Srirama Navami Wishes: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

కాగా, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిన్న శనివారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ నెల 19 వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15న శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్