Thursday, March 12, 2026
HomeTrending Newsమక్కాలో రాష్ట్రం కోసం దువా చేయండి: సిఎం

మక్కాలో రాష్ట్రం కోసం దువా చేయండి: సిఎం

రాష్ట్రంలో ఉన్నప్రజలకు మంచి జరగాలని, ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండేలా హజ్ యాత్రికులు మక్కాలో దువా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాత్రలో అక్కడ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు యాత్రికులతో పాటు హజ్ కమిటీ సభ్యులను కూడా వెంట పంపుతున్నట్లు తెలియజేశారు.

విజయవాడ ఎంబార్కేషన్  పాయింట్ నుంచి తొలిసారిగా హజ్‌ యాత్రకు బయల్దేరుతున్నముస్లిం సోదరులకు సిఎం జగన్ శుబాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు హజ్‌ క్యాంప్‌ నుంచి ఈ బృందం బయల్దేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular