Sunday, February 23, 2025
HomeTrending Newsముస్లిం సోదరులకు సిఎం శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు సిఎం శుభాకాంక్షలు

Happy Ramzan Month: ముస్లింల‌కు ఎంతో పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.  నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ట‌ల‌తో క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించే ఈ పుణ్య‌ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని  తన సందేశంలో పేర్కొన్నారు.

మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ది రంజాన్ మాసంలోనే కావ‌డంతో ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్య‌త‌‌నిస్తార‌న్నారని గుర్తు చేసుకున్నారు.  ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా  ఖర్చు చేస్తూ.. మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని సిఎం అన్నారు.

“రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్