Sunday, February 23, 2025
HomeTrending Newsసిఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు

సిఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడపడుచులకు శుభాకాంక్షలు  తెలియజేశారు. అన్నాచెల్లెళ్ళు- అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధానికి, ఆప్యాయతలకు ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి జరుపుకుంటారని… రాష్ట్రంలో మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా. రాజకీయంగా సాధికారత సాధించే దిశలో మనందరి ప్రభుత్వం ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకువచిందని వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని సరికొత్త పథకాలు మహిళాభ్యుదయానికి తాము అమలు చేస్తున్నామన్నారు.

విజయవాడ గుప్తా కళ్యాణ మండపంలో జరిగిన ఐఏఎస్ అధికారులు కె ప్రవీణ్ కుమార్, కె.సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్ కి సిఎం జగన్ హారజయ్యారు. ఇదే సందర్భంలో ఆ కార్యక్రమానికి వచ్చని పలువురు మహిళా నేతలు సిఎం జగన్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ ఆర్.భాగ్యలక్ష్మి, ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిణిలు సిఎంకు రాఖీ కట్టినవారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్