May Day: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. బానిసత్వం, వెట్టిచారికికి వ్యతిరేకంగా 1886, మే1న చికాగోలో కార్మికులు చేపట్టిన పోరాటం నేటికీ యావత్ ప్రపంచానికి స్పూర్తిదాయకంగా నిలుస్తూ వస్తోంది. ఆ పోరాటంలో అసువులు బాసిన కార్మికుల అమరత్వాన్ని గుర్తు పెట్టుకుంటూ ప్రతి ఏటా మే ఒకటవ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఇండియా సహా వందలాది దేశాలు ఈ మే డే రోజున సెలవు దినంగా ప్రకటించి కార్మిక లోకానికి తమ సంఘీభావం ప్రకటించాయి. భారత దేశంలో 1923న తొలిసారి మే డే ను జరుపుకున్నాం.
ఈ సందర్భంగా ఏపీ సిఎం జగన్ కార్మికలోకానికి తన వందనాలు తెలియజేస్తూ “శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.