వైయస్సార్ లా నేస్తం ద్వారా నాలుగేళ్లలో మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు దాదాపు 50 కోట్ల రూపాయలు సాయం అందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనితో పాటు రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించామని, అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీసభ్యులుగా నిరుపేద లాయర్లను కరోనా సమయంలో దీనిద్వారా ఆదుకున్నామని వివరించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ లా నేస్తం ఆర్ధిక సాయాన్ని జూనియర్ లాయర్ల అకౌంట్లలో జమచేశారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:
* నాలుగు సంవత్సరాలుగా వైయస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నాం.
* లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు ఈ పథకం
* గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నాం.
* వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా తోడుగా ఉంటున్నాం.
*ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం.
*అడ్వొకేట్లకు వాళ్ల కెరీర్ ఆరంభంలో వృత్తిలో నిలదొక్కుకొనేందుకు ఈ మంచి చేస్తున్నాం
* వారి వృత్తిలో నిలదొక్కుకోవడం, తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది.
* అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా 643 మందికి కోవిడ్ సమయంలో వీళ్ల కుటుంబాలకు రూ.52 లక్షలు అందించాం. మరో 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది.
* మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద రూ.11.41 కోట్లు చెల్లించడం జరిగింది.
* రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి ఇచ్చి అడ్వొకేట్ కమ్యూనిటీకి తోడుగా నిలబడగలిగింది.
* ఇవన్నీ మనసు పెట్టి, మంచి జరగాలని మనసారా ఆలోచన చేసి చేయగలిగాం.
* నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను.
* మాట ఇచ్చిన మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ అడుగులు వేయడం, ఈ నాలుగు సంవత్సరాలుగా చేయగలిగాం అని సంతోషంగా చెబుతున్నా.
* ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌కు నా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్.
* ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, పేదవాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ, మంచి చేసే విషయంలో మానవతాదృక్ఫథం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నా.