Sunday, January 19, 2025
HomeTrending Newsఅవుకు రెండో టన్నెల్ ప్రారంభం

అవుకు రెండో టన్నెల్ ప్రారంభం

నిర్మాణం పూర్తయిన అవుకు రెండో టన్నెల్‌ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల విడుదల చేశారు. నంద్యాల జిల్లా జిల్లా మెట్టుపల్లె వద్ద  జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ. 567.94 కోట్ల వ్యయంతో అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెలు పూర్తి చేయడంతో పాటు… మూడవ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. దీనితో ఇప్పటికే మొత్తం రూ. 1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమలో డిప్యూటీ సిఎం అంజాద్ పాషా. మంత్రులు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్