Sunday, March 15, 2026
HomeTrending NewsKCR: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు

KCR: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సీఎం కేసీఆర్ శోభ దంపతులు బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులను వేదమంత్రాలతో, పూర్ణకుంభం పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా… సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలను సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించారు.


ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లు కే.కేశవరావు,జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పద్మారావు కుటుంబసభ్యులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular