Friday, November 22, 2024
HomeTrending Newsఘనంగా గులాబి నేత జన్మదిన వేడుకలు

ఘనంగా గులాబి నేత జన్మదిన వేడుకలు

Cm Kcr Birth Day Celebrations : 

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత పుట్టిన రోజు పురస్కరించుకొని రక్తదానం, అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పళ్ళపంపిణి తదితర సేవ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ  స్వయంగా ఫోన్  చేసి సీఎం కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి.రమణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కెసీఆర్ కు  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె.స్టాలిన్. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ సీఎం కేసిఆర్ కు గవర్నర్ పూల బోకే ను పంపారు. చంద్రశేఖర్ రావు  పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరాటే విద్యార్థులతో Hyderabad సాయిరాం నగర్ కాలనీలో 200 మొక్కలు నాటడం జరిగింది, పర్యావరణ పరిరక్షణ కొరకు శ్రమిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి కాలనీ అధ్యక్షులు కార్యదర్శి కరాటే కోచ్ ప్రవీణ్ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు

అసెంబ్లీ లోని స్పీకర్ ఛాంబర్ లోసీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు.. కేక్ కట్ చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.హాజరైన మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ  మంత్రి, టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు,మంత్రి మహమూద్ అలీ  తదితరులు.

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. రైతు వేదిక వద్ద మొక్కలు నాటి,సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు,మహిళలతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసిన మంత్రి.

Kcr Birth Day Celebrations

తెలంగాణ భవన్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్న చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి

Kcr Birth Day Celebrations

హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం చిలుక నగర్ 7వ డివిజన్ లో నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం టిడిపి, సిపిఐఎం నుండి టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి బ్లాంకెట్ల పంపిణీ చేశారు.. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్లు, టీఆరెఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా సీఎం కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలు. 50 అడుగుల సీఎం కేసీఆర్ బారీ కటౌట్ కు పాలాభిషేకం చేసిన మంత్రి గంగుల కమలాకర్, వేలాదిగా హాజరైన టీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు.

Kcr Birth Day Celebrations

కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పల్లె ప్రకృతి వనం నందు 5000వేల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు గారు, జిల్లా కలెక్టర్ V.P. గౌతమ్ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, సుడా చైర్మెన్ విజయ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, RJC కృష్ణ గారు, కార్పొరేటర్ల, సర్పంచ్ లు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మేడారంలోని పర్యాటక శాఖ గెస్ట్ హౌస్ లో  కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.  సమ్మక్క సారలమ్మ  దీవెనలతో  సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ఆద్వర్యం లో లండన్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కెసిఆర్  జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి,  ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, స్థానిక “ఎల్స్ట్రీ బోరెంహూడ్ ” కౌన్సిలర్ ప్రభాకర్ ఖాజా, ఎన్నారై తెరాస నాయకులు నవీన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్,  వెంకట్ రెడ్డి, శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్, అబుజాఫర్, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్ల, సృజన్ రెడ్డి చాడా, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మధు రెడ్డి, గణేష్ పస్తం, పృథ్వీ రావుల మరియు ప్రవాస సంఘాల నాయకులు పవిత్రా రెడ్డి, శుష్మునా రెడ్డి, స్వాతి,  మాధవ్, శ్రీకాంత్ ముదిరాజ్, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శైలజ, నంతిని, విద్య, అపర్ణ, పావని తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనీ 21 మంది నిరుపేదలకు జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్స చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.ఈ సందర్భంగా ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్స చేసిన ఎమ్మెల్యే గారికి పేషంట్స్ వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో KDCC రాంచందర్ రావు,మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్,కౌన్సిలర్లు క్యాడాసు నవీన్,కోరే గంగామల్లు,సర్పంచులు జాన్,తిరుపతి,జీవన్ రెడ్డి, ఎంపిటిసి లు లావణ్య,రెడ్డి రత్న రవి,నాయకులు మోయిజ్,షోయబ్,డా.విజయ్,ఆసుపత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తిరుపతి నగరంలోని ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి, దుప్పట్లు, పళ్ళు అందజేశారు. ఆ తర్వాత అలిపిరి వద్ద కొబ్బరికాయ కొట్టి తిరుమలకు కాలి నడక ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్