Wednesday, March 18, 2026
HomeTrending Newsత్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

తెలంగాణలో వృత్తిజీవనం సబ్బండవర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీవర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించి  కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బిసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణలో వృత్తి కులాలైన బిసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్ లో మంగళవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా… తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. అందుకు  కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సిఎం ఆదేశించారు. దాంతో..మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతేకాకుండా… ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సిఎం స్పష్టం చేశారు. దాంతోపాటు  యూనిట్ (20+1)  ధరను  పెంచాలని సిఎం నిర్ణయించారు.

నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సిఎం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular