Thursday, March 12, 2026
HomeTrending NewsKomuram Bhim : ఆసిఫాబాద్ లో పోడు పట్టాల పంపిణీ

Komuram Bhim : ఆసిఫాబాద్ లో పోడు పట్టాల పంపిణీ

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పట్టాలు అందించారు.

ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీకి చెందిన కర్పెత విమలాబాయి దంపతులు, కెరమెరి మండలం జోడెఘాట్ గ్రామ పంచాయతీకి చెందిన కాటి అన్యాబాయి దంపతులు, సిర్పూర్ (అర్బన్) మండలం పంగిడి గ్రామ పంచాయతీకి చెందిన కుమ్ర మంకూబాయి దంపతులు, తిర్యానీ మండలం ఏదులపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఏదుల ఎల్లక్క దంపతులు, వాంకిడి మండలం పాటగూడ గ్రామ పంచాయతీకి చెందిన కత్లే భగీరథ దంపతులు, జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన వనిత మగదె దంపతులు, కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన మాధవీలక్ష్మి దంపతులు, మాధవీకల్లుబాయి దంపతులు, కాగజ్ నగర్ మండలం మాలినీ గ్రామ పంచాయతీకి చెందిన సూర్పం సునీత దంపతులు, సూర్పం అనసూయ దంపతులు, కాగజ్ నగర్ ఎన్జీవోస్ కాలనీ టేకం జానూబాయి దంపతులు, ఆత్రం రాంబాయి దంపతులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular