Sunday, January 19, 2025
HomeTrending Newsఆలయాల అభివృద్ధి కేసిఆర్ ఘనత

ఆలయాల అభివృద్ధి కేసిఆర్ ఘనత

దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి వారికి మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు రఘునందన్ రావులు స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ….ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం శ్రీ కేసిఆర్ దేనని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు దేవాలయానికి సంబంధించిన నిధులను ప్రభుత్వాలు, ప్రజా అవసరాలకు వాడుకునేవారని అన్నారు.

స్వరాష్ట్రంలో ప్రభుత్వమే దేవాలయాల నిర్మాణం , పునర్నిర్మాణం, జీర్ణ దేవాలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా దేవుళ్ళకు పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలకు సైతం దేవుళ్ళ పేర్లను పెట్టారని మంత్రి తన్నీరు హరీష్ రావు గుర్తు చేశారు.

దేవాలయం నిర్మాణం కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా రూ.4 కోట్ల 25 లక్షలు, వ్యక్తిగతంగా రూ. కోటి రూపాయలు అందజేశారనీ మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్