Sunday, November 24, 2024
HomeTrending NewsDalita Bandhu: దళిత ద్రోహి కెసిఆర్ - జీవన్ రెడ్డి విమర్శ

Dalita Bandhu: దళిత ద్రోహి కెసిఆర్ – జీవన్ రెడ్డి విమర్శ

అధారాలున్నా దళిత బంధు అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కెసిఆరే ప్రోత్సహించిన వారవుతారని, సిఎం కెసిఆర్ దళిత ద్రోహి అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇంద్రభవన్లో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత సమాజం తలదించుకునేలా కేవలం ఆరోపణలకే, ఎటువంటి ఆధారాలు లేకున్నా ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తాటికొండ రాజయ్యను సీఎం కెసిఆర్ తొలగించారని గుర్తు చేశారు. దళిత బంధు పథకంలో ఒక్కొక్కరి నుండి రు.2-3 లక్షలు వసూలు చేస్తున్నారని, ఆధారాలు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీ ఆరే చెబుతున్నా అవినీతిపరులు, కమిషన్లకు కక్కుర్తి పడిన ప్రజాప్రతినిధుల పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవినీతికి ఎవరు పాల్పడినా సహించమన్న సీఎం కెసిఆర్ అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలనే నిబంధనకు అనుగుణంగా, ఎస్సీ సబ్ ప్లాన్ రూపొందించామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, కేటాయించిన నిధులు మరో సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసేలా నిబంధన ఏర్పాటు చేసి, నిధులు వెచ్చించకుండ దళితులను మభ్య పెడుతున్నారని ద్వజమెత్తారు. 2022-23 బడ్జెట్ లో నియోజక వర్గంలో 3000 చొప్పున స్వంత ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు రు.3 లక్షల చొప్పున ఇచ్చేందుకు 12,000 కోట్లు కేటాయించిన ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.

దళితులకు సంక్షేమం కోసం కేటాయించిన నిధులు సుమారు 50 వేల కోట్లతో 10 లక్షల చొప్పున 5 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులతో ఇళ్లు నిర్మిస్తే ఇళ్లు లేని నిరుపేదలుండరని అన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు సైతం వెచ్చించకపోతే ప్రయోజనం ఏముందని..ఎన్ని లక్షల బడ్జెట్ ప్రవేశ పెడితే ఎం లాభమని అన్నారు. నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేస్తే వేతనాలు చెల్లించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని అన్నారు. పేపర్ లీకేజీ కూడా నియామకంలో జాప్యం కోసం చేసిన కుట్ర లో భాగమేనని ఆరోపించారు. సీఎం కెసిఆర్ కు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే ప్రకటనలకే పరిమితం కాకుండా, దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిదులు ఏ స్థాయిలో ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్