ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే ఆశావహులకు కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది.
ఈనెల 7వ తేదీ నుంచి 16 వరంగల్ నగరంలో జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్ర (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, భద్రకాళీ ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.