Wednesday, September 25, 2024
HomeTrending Newsఈడీకి లంగలు,దొంగలు భయపడుతరు - కెసిఆర్

ఈడీకి లంగలు,దొంగలు భయపడుతరు – కెసిఆర్

మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్‌ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేపు ఏమంటడు నరేంద్ర మోదీ.. కేసీఆర్‌ నేను మీటర్లు పెట్టుమన్న.. నువ్వు పెడుతలేవు.. అయినా మునుగోడులో నాకే ఓటు వేశారు.. నువ్వు జరుగు అని పక్కకు నూకేసి తెచ్చి మీటర్లు పెడుతడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ బీజేపీ కావాలా.. మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ కావాలా?. ఈ విషయంపై గ్రామాల్లో చర్చ జరగాలి? ఎవరు కావాలో చర్చించాలి. గ్రామంలో విద్యావంతులు, యువకులు, పెద్దలు, రైతుబంధు పొందుతున్న లక్ష మంది రైతులు చర్చించాలి’ అని అన్నారు.


బీజేపీకి ఓటు పడితే.. బాయికాడ మీటర్‌ పడ్డట్టే..
‘నేను మీటర్లు పెట్టా? అని ప్రధానమంత్రితో కొట్లాడుతున్నా.. నా బలం ఏందీ..? మీరేకదా? నా ధైర్యమేంది.. మీరే కదా? మరి మీరే నన్ను బలహీన పరిస్తే నేను ఏం చేయాలి? రేపు ఏమంటరు వాళ్లు.. పోయి ఒర్రి చెప్పినవ్‌ కదా మనుగోడులో, మాకే గుద్దిన్రు.. నన్ను గుద్ది కిందపడగొడుతరు.. మీటర్లు పెడుతరు. ఆలోచన చేయాలి. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్‌ రాలే.. ఇప్పుడు వస్తదా? వచ్చిందంటే మీటర్‌ వస్తది? బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బాయికాడ మీటర్‌ పడ్డది. ఇది పక్కా.. రాసిపెట్టుకోండి.

వాళ్ల గర్వం ఏందండీ ? దేశంలో ఏమైనా మర్యాద, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు ఉన్నయా?.. తెలంగాణ అసెంబ్లీలో ఉండేది 119 ఎమ్మెల్యేలు. అందులో 103 మంది టీఆర్‌ఎస్‌, ఇంకో ఏడుగురు మిత్రపక్షం.. మిగతావి తొమ్మిది తోకలు.. ఈడ మాట్లాడుతరు.. ఆ తోకల్లో రెండు పార్టీలు.. మాట్లాడేటోడు మూడు తోకలున్నాయోడే.. మూడు తోకలున్నోడు.. 110 తోకలు ఉన్నోన్ని పడగొట్టి.. ఏక్‌నాథ్‌ షిండేను తెస్తడట? ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా? బలుపా? అధికారమదంతో కండ్లు మూసుకొని పోయాయా?’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

ఏం పీక్కుంటావో.. పీక్కో
‘ఏంది ఇది.. ఇది దేశమా? అరాచకమా? ఎవలను పడితే వాళ్లను ముఖ్యమంత్రులను, పెద్దపెద్ద వాళ్లను.. నీ మీద ఈడీ కేసు పెడుతానంటే.. ఈడీయా.. బోడినా..రా అన్న. ఈడీ వస్తే నా వద్ద ఏమున్నది.. వాడే నాకు చాయ్‌ తాగిపిచ్చిపోవాలే.. దొంగలు, లంగలు భయపడుతరు. ధర్మం, నిజాయితీగా ఉన్నోళ్లు ఎందుకు భయపడుతరు. నీ మీద ఈడీ పెడుతమంటే.. ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో.. ఏం పీక్కుంటవో పీక్కో.. ప్రజల కోసం నిలబడే వాళ్లు, ప్రజల కోసం ఆలోచించే వాళ్లు.. ప్రజల మేలుకోరే వాళ్లు, ప్రజలకు కడుపునిండా బుక్కెడు అన్నం దొరకాలనే వారు.. భయపడరు నీకు మోదీ.. నువ్వు గోకినా.. గోకకపోయినా.. నేనే నిన్ను గోకుతా అని చెప్పినా.. ఇది దేశం ఎవని అయ్యసొత్తు కాదు.

నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా గెలిచిండు.. టూ థర్డ్‌ మెజారిటీతో గెలిచిండు. అక్కడ గవర్నమెంట్‌ పడగొడుతా? అంటడు. బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలిచింది.. బెంగాల్‌ చరిత్రలో అత్యధిక సీట్లతో గెలిచింది. అక్కడకుపోయి నిన్ను పడగొడుతా? అంటడు.. నిన్ను పడగొట్టెటోళ్లు లేరు అనుకుంటున్నవా? నిన్ను పడగొట్టడానికి.. వేరే శత్రువు అవసరం లేదు మోదీ.. నీ అహంకారం, నీ గర్వం శత్రువు అయితది’ అంటూ సీఎం ధ్వజమెత్తారు.

Also Read : మునుగోడులో తెరాసకు సిపిఐ మద్దతు

RELATED ARTICLES

Most Popular

న్యూస్