Monday, February 24, 2025
HomeTrending Newsరేపు స్టాలిన్ తో కేసియార్ భేటి

రేపు స్టాలిన్ తో కేసియార్ భేటి

TS- TN CMs meet:
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా తమిళనాడు శ్రీరంగంలోని రంగ‌నాథస్వామిని నేడు ద‌ర్శించుకున్నారు. కేసీయార్ సతీమణి శోభ, మంత్రి కె.తారకరామారావు, కేటిఆర్ సతీమణి శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు వున్నారు.

ఆలయానికి సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కెసియార్ కు తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రు, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శ్రీనివాసు స్వాగతం పలికారు. ఈ రాత్రికి చెన్నైలోని ఐటీసీ చోళ హోట‌ల్‌లో కేసీఆర్ బ‌స చేయ‌నున్నారు. రేపు ఉదయం ఇటీవల అస్వస్థతకు గురైన తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు.  అనంతరం కేసీయార్ తిరుత్త‌ణిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొననున్నారు, సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల మ‌ధ్య తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో కెసియార్ భేటీ కానున్నారు. స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.  రంగనాథ స్వామిని దర్శిచుకోవడం ఆనందంగా ఉందని కేసియార్ వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.

Also Read : త్వరగా పూర్తి చేయండి: కెసియార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్