Saturday, January 18, 2025
HomeTrending Newsప్రగతి కాంతుల దీపావళి... సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

ప్రగతి కాంతుల దీపావళి… సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు. తెలంగాణ మాదిరే, దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులతో సిరి సంపదలతో తుల తూగాలని, సందర్భంగా సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. బాణా సంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలను, సీఎం కేసీఆర్ కోరారు.

Also Read ప్రతి ఇంటా ‘ఆనంద దీపావళి’: సిఎం జగన్ ఆకాంక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్