Thursday, March 12, 2026
HomeTrending NewsMedak: సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా

Medak: సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసింది. ఈ నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

ఈనెల 23వ తేదీన (బుధవారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. నిర్మాణం పూర్తి చేసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular