Tuesday, March 17, 2026
HomeTrending NewsReview on Covid: సన్నద్ధంగా ఉండాలి: కోవిడ్ పై సమీక్షలో సిఎం

Review on Covid: సన్నద్ధంగా ఉండాలి: కోవిడ్ పై సమీక్షలో సిఎం

కరోనా వ్యాపిస్తుందన్న సూచనల నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సిఎం కోవిడ్‌ తాజా పరిస్థితిపై ఆరా తీశారు.  గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్నారు.

కోవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సిఎంకు వివరించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని తెలిపారు.  ఆక్సిజన్‌ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్‌ చేసి  సిద్ధంచేసుకుంటున్నామన్నారు.  అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధం చేశామని వివరించారు.

ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.

  • ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలి
  • ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలి
  • ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్‌ వ్యవస్ధ కోవిడ్‌ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుంది
  • గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలి
  • ప్రతి విలేజ్‌ క్లినిక్‌కూ టెస్టింగ్‌ కిట్స్, మందులు పంపించాలి
  • ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలి

సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సాంబబశివారెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ బి చంద్రశేఖర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, డ్రగ్స్‌ డీజీ రవి శంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular