Thursday, March 19, 2026
HomeTrending Newsభగీరథరెడ్డికి సిఎం జగన్ నివాళి

భగీరథరెడ్డికి సిఎం జగన్ నివాళి

దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్ధీవదేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.  నంద్యాల జిల్లా అవుకులోని  భగీరథరెడ్డి నివాసానికి చేరుకున్న సిఎం ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనతరం భగీరథ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

ముఖ్యమంత్రితో పాటు హాజరైన డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

Also Read : ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular