Tributes to Intellectual: భారత రాజ్యంగ నిర్మాత, మేధావి డా. బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూపు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు తదితరులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
“రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు” అంటూ సిఎం జగన్ ట్విట్టర్ ద్వారా ఆ మహనీయుడికి అక్షరాంజలి సమర్పించారు.
Also Read : వచ్చే ఏప్రిల్ నాటికి డా. అంబేద్కర్ విగ్రహం