Sunday, January 19, 2025
HomeTrending Newsప్రకాశం పంతులుకు సిఎం నివాళి

ప్రకాశం పంతులుకు సిఎం నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి నివాళులర్పించారు.

“స్వతంత్ర సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి” అంటూ సాజాజిక మాధ్యమాల్లో సియం జగన్  పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్