చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పూతలపట్టు ఎమ్మెల్యే యం.యస్.బాబు, కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఏ. మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వీ. సురేష్ బాబులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.
ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసిన అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మలు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.