Saturday, November 23, 2024
HomeTrending Newsయంత్రసేవ పరికరాలు సిద్ధంగా ఉంచాలి: సిఎం

యంత్రసేవ పరికరాలు సిద్ధంగా ఉంచాలి: సిఎం

ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  సంబంధిత ఆర్బీకేల పరిధిలోఉన్నయంత్రాలు,  పరికరాలు, వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు. 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవకింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు సిఎంకు వివరించారు.  1615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేశామన్నారు.  690.87 కోట్ల రూపాయల విలువైన పరికరాలు అందించగా, ఇందులో 240.67కోట్ల సబ్సిడీ అని అధికారులు తెలిపారు.

మరో 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకుగాను, మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి కార్యాచరణ సిద్ధ చేయాలని సిఎం సూచించారు. దీనికోసం రూ.910 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. ఆర్బీకేల పరిధిలో  కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

ఆర్బీకేల్లో గోదాముల  నిర్మాణం, చేయూత, అమూల్ పాల సేకరణ, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప్రగతిపై, ధాన్యం సేకరణపై కూడా సిఎం అధికారులతో సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశుసంవర్ధక, పాడిపరిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో  పాల్గొన్నారు.

Also Read : కొనుగోలు విషయంలో రైతుకు స్వేఛ్చ  

RELATED ARTICLES

Most Popular

న్యూస్