స్వర్ణముఖిపై 30 కోట్ల రూపాయలతో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవలి తుపానుకు స్వర్ణముఖి బ్రీచ్ కారణంగా నష్టం వాటిల్లిందని, దానికి శాశ్వత పరిష్కారం కోసం ఈ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ ముందుగా తిరుపతి చేరుకున్నారు, అక్కడినుంచి హెలికాఫ్టర్ ఏరియల్ వ్యూలో తుపాను నష్టంపై తిరుపతి జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోట మండలం విద్యానగర్ నుంచి హెలీప్యాడ్ నుంచి నేరుగా బాలిరెడ్డిపాళెం-గంగన్నపాళెం మధ్యలో స్వర్ణముఖి నదికి గండిపడిన ప్రాంతాలను పరిశీలించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. బాలిరెడ్డిపాళెం చేరుకుని తుపాను బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:
- ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి. దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు.
- మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే.
- దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది.
- దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది.
- ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ.
- ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు.
- అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా. ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు.
- ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
- పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం.
- ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
- జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీచ్ అయ్యాయి.
- రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం.
- రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి.
- యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి.
- ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు.
- ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్కే ఫోన్ వస్తుంది.