Sunday, January 26, 2025
HomeTrending NewsVontimitta: సిఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

Vontimitta: సిఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దయింది. ఏప్రిల్ 5న  బుధవారం వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో  శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సిఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహించే సీతారామ కల్యాణంలో సిఎం పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం,టిటిడి ఏర్పాట్లు చేశాయి,

అయితే ఈ ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో సిఎం జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి పెరగడంతో ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచించారు. దీనితో రేపటి ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దుచేశారు. గతంలో ఇలానే కాలికిగాయమై సిఎం జగన్ చాలారోజులపాటు ఇబ్బందిపడ్డారు.

సిఎం బదులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ) కొట్టు సత్యనారాయణ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్