Tuesday, March 10, 2026
HomeTrending NewsGurukul Trust: తిరుపతి స్కూల్ కు వచ్చే నెలలో భూమిపూజ

Gurukul Trust: తిరుపతి స్కూల్ కు వచ్చే నెలలో భూమిపూజ

తిరుపతిలో నెలకొల్పుతోన్న శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ఇంటర్నేషనల్ స్కూల్ శంఖుస్థాపన కు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు.  నేడు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముగురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు సిఎంను కలుసుకున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసింది. వచ్చే నెలలో తిరుపతి స్కూల్‌ శంకుస్ధాపన చేస్తున్నారు.

సీఎంతో సమావేశం అనంతరం  ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి మాట్లాడుతూ..  శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు, 40 వేల మందికి పైగా విద్యార్ధులు ఈ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్నారు. తమ విద్యాసంస్ధల ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించడంతో సీఎంగారికి కృతజ్ఞతలు తెలియజేశాం. తిరుపతి స్కూల్‌ శంకుస్ధాపన తర్వాత అతి త్వరలోనే పులివెందుల, విశాఖ స్కూల్స్‌కు కూడా భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ స్కూల్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి భోదించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామ”ని వివరించారు.

సిఎంతో జరిగిన సమావేశంలో ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి, ధర్మ్‌సాగర్‌ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular