Jagananna Vidya Deevena:
ఈ విద్యా సంవత్సరం మూడో విడత ఫీజు రీఇంబర్స్ మెంట్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లించేందుకు కొత్త విధానం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. విద్యా సంవత్సరాన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజించి ఫీజు రీఇంబర్స్ మెంట్ నిధులను కూడా నాలుగు విడతల్లో చెల్లించే సరికొత్త సంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. త్రైమాసికం పూర్తయిన వెంటనే ఆ కాలానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ వస్తోంది.
ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కంప్యుటర్ బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడత నిధులను ఈ ఏడాది ఏప్రిల్ 19న, రెండో విడత జులై 29న చెల్లించిన ప్రభుత్వం నేడు మూడో విడత చెల్లిస్తోంది. నాలుగో విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనుంది .
Also Read : వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతం