Sunday, January 19, 2025
HomeTrending Newsటీచర్స్ డే వేడుకలు-హాజరు కానున్న సిఎం

టీచర్స్ డే వేడుకలు-హాజరు కానున్న సిఎం

సోమవారం, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం పదిన్నరకు వేదికకు చేరుకోనున్న ముఖ్యమంత్రి రెండు గంటలపాటు అక్కడ గడపనున్నారు.  బోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, భాషా- సాంస్కృతిక శాఖ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సిఎం చేతుల మీదుగా అవార్డులు అందజేననున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ వేడుకలు జరగుతున్నాయి. పేస్ రికగ్నేషన్ యాప్ ను కొంతమంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తుండగా.. ఎత్తి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సిందేనని  స్పష్టం చేసింది. మొన్న విద్యా శాఖా మంత్రి బొత్స సమక్షంలో జరిగిన చర్చల్లో కొంత సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో జరుగుతున్న ఈ టీచర్స్ డే వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్