ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అడానీ డేటా సెంటర్ లకు శంఖుస్థాపన చేయనున్నారు.
రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురంలో; అనంతరం రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్), రూ. 194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులకు విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా నేడు శంకుస్ధాపన చేయనున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం…. రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు.
రూ. 21,844 కోట్లతో వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్)…. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.
తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీరుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీరు అందించడమే లక్ష్యంగా రూ. 194.40 కోట్ల వ్యయంతో తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులు, డిసెంబర్ 2024 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు
చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్ సెంటర్
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ. 23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, అన్ని కాలాల్లో సముద్రంలో సులువుగా చేపలు వేటాడేందుకు వెసులుబాటు, తుఫాను, విపత్తు సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బతినకుండా లంగర్ వేసే సదుపాయం, పెరగనున్న మత్స్యకారుల ఆదాయం