Saturday, November 23, 2024
HomeTrending NewsBhogapuram Airport: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల క‌ల భోగాపురం ఎయిర్ పోర్ట్: గుడివాడ  

Bhogapuram Airport: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల క‌ల భోగాపురం ఎయిర్ పోర్ట్: గుడివాడ  

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి మే 3వ తేదీన శంకుస్థాప‌న చేస్తారని రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్ర‌య నిర్మాణం ద్వారా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరుతుంద‌ని చెప్పారు.  నిర్మాణానికి సేక‌రించిన భూముల‌ను… ట్రంపెట్ ర‌హ‌దారి నిర్మాణం,  సిఎం బ‌హిరంగస‌భ జరిగే ప్ర‌దేశాల‌ను మంత్రి నేడు పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా అమ‌ర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ భోగాపురం విమానాశ్ర‌య నిర్మాణాన్ని ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుగా భావిస్తోంద‌ని చెప్పారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల సుదీర్ఘ స్వ‌ప్నం నెర‌వేరే రోజు ఆస‌న్న‌మైందని అన్నారు. శంకుస్థాప‌న జ‌రిపేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల లాంఛ‌నాల‌ను పూర్తి చేశామ‌న్నారు. సుమారు 2,200 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మిత‌మ‌య్యే ఈ ఎయిర్‌పోర్టుకు, ఇప్ప‌టికే దాదాపు 2,195 ఎక‌రాల భూసేక‌ర‌ణ పూర్తి అయ్యింద‌ని, మిగిలిన కొద్దిపాటి భూ సేక‌ర‌ణ కూడా త్వ‌ర‌లో పూర్తి కానుంద‌ని తెలిపారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తామ‌ని చెప్పారు. శంకుస్థాప‌న అనంత‌రం 24 నుంచి 30 నెల‌ల్లో  నిర్మాణం పూర్తి అవుతుంద‌ని చెప్పారు.

అంతకుముందు…జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌రికాల వ‌లెవ‌న్‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో స‌న్‌రే రీసార్ట్‌ లో సమీక్షా సమావేశాన్ని నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను తెలుసుకున్నారు. శంకుస్థాప‌న‌, ముఖ్య‌మంత్రి స‌భ ఏర్పాట్ల‌పై అధికారులు, నాయ‌కుల‌తో మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్