Thursday, March 19, 2026
HomeTrending Newsసంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్‌ జగన్‌

సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్‌ జగన్‌

CM Ys Jagan Sankranthi Celebrations :

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద ఈ రోజు వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి, భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టుతో హాజరై సంబరాలను తిలకించిన సీఎం వైఎస్‌ జగన్‌. సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే… సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరగగా ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular