పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు ఇదీ.
బుధవారం ఉ.10.00 : సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
10.10: హెలీకాప్టర్‌లో పోలవరానికి ప్రయాణం
11.00: ప్రాజెక్టు హెలీప్యాడ్ వద్దకు చేరిక
11.10–12.00: క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
మ.12.00–1.00: అధికారులతో సమీక్ష సమావేశం
1.20: హెలీకాప్టర్‌లో తిరుగుపయనం
2.00: తాడేపల్లిలోని హెలీప్యాడ్‌కు రాక
2.15: సీఎం నివాసానికి తిరిగి పయనం అవుతారు.