Friday, March 20, 2026
HomeTrending Newsలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ముగ్గురు సీఎంలు దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్‌, పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వామీ వారి దర్శనానికి వెళ్ళలేదు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారితోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో సత్కరించారు.

శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు తిలకించారు. ఆలయ ప్రాశస్త్యం , ఆధునీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎం లు , నేతలకు వివరించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular