Saturday, March 14, 2026
HomeTrending Newsహైదరాబాద్ జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు

హైదరాబాద్ జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున MLA ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ల ఏర్పాటు, నిర్వహణ పై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLC లు MS.ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, BC వెల్ఫేర్ JD అలోక్, DD ఆశన్న, SC కార్పోరేషన్ DD రామారావు, మైనారిటీ వెల్ఫేర్ DD ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ DD రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులలో అనేక మంది నిరుపేదలు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ వివరించారు. ఈ కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్ధులకు ఒక్కొకరికి నెలకు 5 వేల రూపాయల వరకు ఫుడ్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చుల కోసం చెల్లిస్తుందని తెలిపారు. ఒక్కో బ్యాచ్ కు 100 మంది చొప్పున మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుభవజ్ఞులైన వారితో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. నియోజకవర్గాలలో BC కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఏప్రిల్ 27 వ తేదీ నుండి గ్రూప్ -1 శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు JD అలోక్ కుమార్ వివరించారు. అదేవిధంగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు మే 7 వ తేదీ నుండి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మైనారిటీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ లోని ఉర్దూ మాస్కాన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెంటర్ లో మే 6 వ తేదీ నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. SC కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిజాం కళాశాల లో ఏర్పాటు చేసిన సెంటర్ లో ఏప్రిల్ 29 వ తేదీ నుండి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు.

Also Read : బీసీ అభ్యర్థులకు 103 స్టడీ సెంటర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular