Sunday, March 15, 2026
HomeTrending NewsCoca Cola:తెలంగాణలో కోకా కోల రెండో యూనిట్

Coca Cola:తెలంగాణలో కోకా కోల రెండో యూనిట్

తెలంగాణలో కోకా కోల సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్న సంస్థ తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సమావేశంలో సంస్థ తన ప్రణాళికలను తెలియజేసింది. కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ సంస్థకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ భారతదేశం అని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. అమీన్పూర్ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టమన్నారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో 1000 కోట్ల రూపాయలతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏప్రిల్ నెల 22 లో తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎం ఓ యు కూడా కుదుర్చుకున్నామని తెలిపారు. కోకా కోలా సంస్థ అదనంగా మరో 647 కోట్ల రూపాయలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్ లో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తి అవుతుందని తెలిపింది.

దీంతోపాటు తెలంగాణలో రెండవ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్/ వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కోకాకోల సంస్థ దాదాపుగా 2500 కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణలో పెట్టినట్లు అవుతుందని కోకాకోల సంస్థ మంత్రి కేటీఆర్ కు తెలిపింది.

అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకా కోల తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కే తారక రామారావు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండవ తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు మేక్ గ్రీవికి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular