Wednesday, March 18, 2026
HomeTrending Newsకమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం.. పోలీసు విభాగానికి మూడో నిఘా నేత్రంగా పనిచేయనుంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు లక్ష కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్‌ కేంద్రంలో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా సిబ్బంది పని చేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.

 

దీన్ని ఐదు ట‌వ‌ర్లుగా విభ‌జించారు. ట‌వ‌ర్ -ఏ లో హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌రేట్ ఉంటుంది. ట‌వర్ -బీలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని టెక్నాల‌జీస్ ఉంటాయి. ట‌వ‌ర్ -సీ లో ఆడిటోరియం, టవర్​- డీలో మీడియా, టవర్​-ఈ అనేది కమాండ్​ కంట్రోల్​ అండ్ డేటా సెంటర్​ ఉంటుంది. ఇది పర్యావరణహిత, ఐకానిక్​ భవనం.

 

ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలు ఇందులో ఉన్నాయి. దీని ఏర్పాటుతో నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ .. ఇలా అన్ని విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలు కానుంది.

కమాండ్ , కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని డిపార్ట్ మెంట్స్ చీఫ్ లు ఒకే దగ్గర సమావేశమై నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీని కోసం ఏడో అంతస్తులో సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల చీఫ్ లకు ఛాంబర్లు ఉన్నాయి.

Also Read : ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular