Sunday, March 16, 2025
HomeTrending NewsPalamuru Lift : పాలమూరుపై ఈ రోజు సిఎం సమీక్ష

Palamuru Lift : పాలమూరుపై ఈ రోజు సిఎం సమీక్ష

డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని సీఎం సమావేశ మందిరంలో సోమవారం (01.05.2023) మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్, కొడంగల్, వికారాబాద్ కు వెళ్లే తాగునీటి కాల్వల గురించి చర్చించనున్నారు.
ఈ సమీక్షలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మరియు ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొననున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్