Monday, February 3, 2025
HomeTrending Newsపోలవరం నిర్వాసితుల ఆందోళన  

పోలవరం నిర్వాసితుల ఆందోళన  

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో అర్హులైన కొంతమందికి అవకతవకలు జరిగాయని గిరిజన నిర్వాసిత లబ్ధిదారులతో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర  ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు 44 గిరిజన గ్రామాలలో మరికొంతమంది పూర్తిగా నిరాశ్రయులై నిలువ నీడ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందుకూరుపేట స్థానిక బస్ సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.  సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా సభ్యులు పలివేల వీరబాబుతో పాటు  పలువురు పోలవరం నిర్వాసిత లబ్ధిదారులు దేవీపట్నం తాసిల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.

తహసీల్దార్ ఎం వీర్రాజు సానుకూలంగా స్పందించి అర్జీని అందుకుని పై స్థాయి అధికారులకు అందజేస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోసూరి సతీష్ రాజు,సిద్దే నాగరాజు, పోలవరం నిర్వాసితుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్