Saturday, January 18, 2025
HomeTrending Newsమంత్రి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం - కెసిఆర్

మంత్రి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం – కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుబూతి తెలిపారు. ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేసే మేకపాటి, చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమన్నారు.

అపోలో హాస్పిటల్ లో గౌతమ్ రెడ్డి పార్దీవ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సన్నిహితుడైన మేకపాటి మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడని ఆయన మరణం తీరని లోటని మంత్రి కేటిఆర్ అన్నారు. మంత్రి గౌతం మృతికి మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత  తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్