Thursday, March 19, 2026
HomeTrending Newsఅవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు అభినంద‌న‌లు

అవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు అభినంద‌న‌లు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అభినందించారు. సీఈసీ కోర్సులో ఫ‌స్ట్ క్లాసులో పాసైన ఆ క‌వ‌ల‌ల‌కు మంత్రులు స్వీట్లు తినిపించి, శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వీణ – వాణిల‌కు కొత్త బ‌ట్ట‌లను అందించారు. ఈ కార్య‌క్ర‌మం యూసుఫ్‌గూడ‌లోని మ‌హిళాభివృద్ధి – శిశు సంక్షేమ కార్యాల‌యంలో జ‌రిగింది. మంగళవారం విడుదల చేసిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో సీఈసీలో వీణాకు 712 మార్కులు, వాణికి 707 మార్కులు వచ్చాయి. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు వీణావాణీలకు స్టేట్‌ హోం నుంచే పరీక్ష రాసే అవకాశం కల్పించిందని హోం ఇంచార్జి సఫియా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular