Saturday, January 18, 2025
HomeTrending Newsత్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు - మంత్రి ఎర్రబెల్లి

త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు – మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్ బీజేపీ లు చెత్త పార్టీలని, వాళ్ళ వల్లే పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వాళ్ళ వళ్ళ ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని వాళ్ళే లాభ పడ్డారని విమర్శించారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు (సోమవారం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతల పల్లి లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, పంచాయితీ రాజ్ కమిషనర్ శరత్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల కేంద్రం మూడు చింతల పల్లి లో రూ.15 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్, బిజెపి నేతల మాటలు నమ్ముకుంటే, నట్టేట మునిగినట్లే అన్నారు. వాళ్ళ హయంలో రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిందని, గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో సీఎం కెసిఆర్ వచ్చాకే, గ్రామాలకు మంచి దశ వచ్చిందని, ప్రతి గ్రామానికి నిధులు అందే విధంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 230 కోట్లు ఇస్తున్నది సీఎం కెసిఆర్ మాత్రమే అని తెలిపారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే, అడగటం తెలియదు, కానీ ఏదేదో మాట్లాడుతున్నారని కాంగ్రెస్, బిజెపి నేతల తీరును తప్పుపట్టారు. ఇంటింటికీ నీళ్ళు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు వచ్చాయని, గతంలో మనం ఎప్పుడైనా చూశామా అని మంత్రి అన్నారు. కరోనాలో ఎన్నో సమస్యలు. అయినా సరే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని వివరించారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ లో అభివృద్ధి చరిత్రాత్మకం, ఇది సీఎం కెసిఆర్ వల్లే సాధ్యం అయింది. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు వచ్చాయన్నారు. మూడు చింతల పల్లి కొత్తగా మండలం అయిన తర్వాత అభివృద్ధి బాగా జరుగుతున్నదన్నారు. ప్రగతిని మనమంతా కొనసాగించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు, బీమా, కళ్యాణ లక్ష్మి, షాది. ముబారక్, పెన్షన్లు ఇస్తున్న ఘనత మన్ సీఎం కెసిఆర్ దని మంత్రి కొనియాడారు.

Also Read : కేంద్రం బకాయిలపై సర్పంచుల ఆగ్రహం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్