Saturday, March 14, 2026
HomeTrending NewsBRS: ధరణి మా విధానం... దళారి కాంగ్రెస్ విధానం - ఎమ్మెల్సీ కవిత

BRS: ధరణి మా విధానం… దళారి కాంగ్రెస్ విధానం – ఎమ్మెల్సీ కవిత

తనపై ఆరోపణలు చేస్తున్న బిజెపి ఎంపీ అరవింద్ కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆలోగా రుజువు చెయ్యకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అరవిందుకు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.

శుక్రవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత స్థానికంగా విలేకరులతో ఇస్తా గోష్ఠి గా మాట్లాడారు.

ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని, అందుకే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. గతంలో పాలించిన పార్టీలు కమిషన్లకు కక్కుర్తి పడేదని, బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డును పూర్తి చేయలేకపోయారని అన్నారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెంటబడి పరిష్కస్తే నిర్మాణం పూర్తయిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఎవరు, ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. “అరవింద్ కు 24 గంటల సమయం ఇస్తున్న. నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి. కాయిదం పట్టుకురా… లేకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. ” అని సవాల్ విసిరారు. తన తండ్రిని అంటే వదిలేశామని, ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తున్నారని, ఎవరూ ఊరుకోరని, మజాక్ చేస్తే బాగుండదని హెచ్చరించారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారని అర్వింద్ ను నిలదీశారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చిచెప్పారు.

రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారని, రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తలకు కూడా మూడు గంటలే సరిపోతుందని చెప్పగలదా అని ప్రశ్నించారు. పైసలు ఉన్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిలబడుతాయని, బీఆర్ఎస్ ఎప్పడూ పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమయిందని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ సాయం చేయదన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. ధరణిని రద్దు చేసి దళారులను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆరోపించారు. ధరణి వల్ల భూవివాదాలు సమసిపోయాయని, చిన్నచిన్న సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. ధరణి మా విధానం… దళారి కాంగ్రెస్ విధానం అని విమర్శించారు.

బీఆర్ఎస్, బీజేపీకి డీఎన్ఏ మ్యాచ్ కాదని చెప్పారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటామని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని, కానీ ఆ పోటీ కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దూర స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. గతం కంటే భారీ మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular