Friday, March 28, 2025
HomeTrending Newsకడప బరిలో షర్మిల, పోటీకి దూరంగా రఘువీరా!

కడప బరిలో షర్మిల, పోటీకి దూరంగా రఘువీరా!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దాదాపు ఆమోదముద్ర వేసింది. నేడు జరిగిన సమావేశంలో ఏపీలోని 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు ఎన్నికల సంఘం ఖరారు చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. రేపు అభ్యర్ధుల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

కాగా, షర్మిల కడప నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ అభ్యర్ధుల తరఫున ప్రచార బాధ్యతలను ఆయన పర్యవేక్షించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజమండ్రి నుంచి; కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు-కాకినాడ;  మరో కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం-బాపట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా సినీ నిర్మాత సత్యారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.

అరకు, అమలాపురం, విజయవాడ, గుంటూరు,  తిరుపతి, అనంతపురం, నంద్యాల, కర్నూలు లోక్ సభ స్థానాలు పెండింగ్ లో పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్