Friday, March 20, 2026
HomeTrending Newsబిఆర్ఎస్, బిజెపి నేతలకు పదవుల యావ - కాంగ్రెస్

బిఆర్ఎస్, బిజెపి నేతలకు పదవుల యావ – కాంగ్రెస్

పదవులే పరమావధి గా బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు అధికారం మీద యావ లేదు అందుకే ప్రధాని అయ్యే అవకాశం ఉన్న మన్మోహన్ సింగ్ నీ ప్రధాని చేశారని అన్నారు.  హైదరాబాద్ గాంధీభవన్ లో ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్…కాంగ్రెస్ పని అయిపోయింది అని హరీష్ రావు చెప్పడం కాదు, ప్రజలు మీ పని పట్టే పనిలో ఉన్నారని హెచ్చరించారు.

సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ లేదు, మీకు పదవులు వచ్చాయి అంటే సోనియా గాంధీ భిక్షతో వచ్చాయని మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల 20, 21,22 లో ఏఐసీసీ ఇంచార్జ్ తెలంగాణ పర్యటనకు విచేస్తున్నారని, మొన్న కలవని నేతలతో కూడా సమావేశం అవుతారని వెల్లడించారు. ఆ సమావేశంలో హత్ సే హత్ జోడో యాత్ర, పార్టీ బలోపేతం మీద చర్చిస్తారన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థుతుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు.

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలల్లో తప్పుల తడకగా ఉందని, ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలకు వందల కోట్లు పెట్టీ సామాన్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తున్నారని మహేష్ కుమార్ ఆరోపించారు. టీచర్ల ఎమ్మెల్సీ లో కూడా అదే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular