Friday, November 22, 2024
HomeTrending Newsసీఎం పదవికి హేమంత అనర్హుడు - జీవన్ రెడ్డి

సీఎం పదవికి హేమంత అనర్హుడు – జీవన్ రెడ్డి

Assam Cm : కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి దేశంలో ఏ పార్టీకి లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్ది అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరమ్మ మనుమడు, ఎంపి రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలు ఆరాధించే, భారతదేశ సంస్కృతిని గౌరవించే కుటుంబ వ్యవస్థను అవమానపరిచే విధంగా ఉన్నాయని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే పీసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు వెళ్లి జగిత్యాల పట్టణ సిఐ కోరే కిషోర్ కు అస్సాం ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని సోమవారం ఫిర్యాదు చేశారు.

ఈ సందర్బంగా జీవన్ రెడ్ది మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించడం వల్ల ఉన్నత పదవుల్లో ఉన్నవారు సమాజానికి మేలు చేయాలే గాని ఇటువంటి నీచమైన వాక్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశ సంస్కృతిని దెబ్బతిసేలా ఉన్న వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంను సమాజం నుంచే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశ సంస్కృతి, ఆచారాలు,కుటుంబ వ్యవస్థపై దాడి చేసే విధంగా నీచమైన వ్యాక్యాలు చేసిన హిమంతకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికతలేదన్నారు. ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం స్పందించి హిమంత శర్మ ను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని జీవన్ రెడ్ది డిమాండ్ చేశారు. హిమంతశర్మపై చర్యలు తీసుకోకుంటే ఈదేశానికి అందిస్తున్న బిజెపి బావాజాలం ఇదేనా..? అని దేశ ప్రజలు మీపార్టీని ఈసడించుకుంటారన్నారని విమర్శించారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేనా బిజెపి పార్టీ నేర్పుతున్న సంస్కృతని ఎమ్మెల్సీ జీవన్ రెడ్ది బిజెపి నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి దేశంలో ఏపార్టీకి లేదని చెబుతూ ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన పార్టీ కాంగ్రెస్ అని జీవన్ రెడ్ది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్గి చైర్మన్ గిరి నాగభూషణం ,గాజెంగి నందయ్య ,తాటిపర్తి దేవేందర్ రెడ్డి , బండ శంకర్, కౌన్సిలర్ కండ్లపెల్లి దుర్గయ్య ,సిరాజొద్దీన్ మన్సూర్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ ,అల్లాల రమేష్ రావు ,పుప్పాల అశోక్, మాజీ ఎంపిపి ధర రమేష్ ,కొండ్ర జగన్,గుంటి జగదీశ్వర్,మాజీ కౌన్సిలర్ బింగిరవి, చందా రాదకిషన్,కుర్షిద్ ,చాంద్ పాషా,బాపురెడ్డి,నేహాల్,కాంగ్రెస్, యూత్ కాంగ్రెసు, ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.

Also Read : కర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్