Congress Political Training Classes :
టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు హైదరాబాద్ కొంపల్లి లోని ఆస్పైసియాస్ కన్వెన్షన్ సెంటర్ లో మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 119 నియోజక వర్గాల నుంచి దాదాపు 1200 మంది పాల్గొనే ఈ శిక్షణ తరగతులలో ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ్యుల నమోదు కార్యక్రమం, 10.45 కు జెండావిష్కరణ తో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పార్టీ పటిష్టత, సిద్ధాంతాలు అనే అంశాలపై మాట్లాడుతారు. డిజిటల్ మెంబెర్షిప్ పైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్, ప్రజా చైతన్య పాదయాత్రపై ఏఐసీసీ కార్యక్రమాల ఇంచార్జి మహేశ్వర్ రెడ్డి, దళితులపై దాడుల గురించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సామాజిక న్యాయం పైన మధు యాష్కీ, నైనాల గోవర్ధన్ తదితరులు మాట్లాడుతారు.
నీటి పారుదల, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వ్యవసాయం, విద్యుత్, పోడు భూములు, మైనారిటీ సంక్షేమం, ప్రస్తుత రాజకీయ అంశాలపైన ప్రసంగాలు ఉంటాయి. కార్యక్రమాల నిర్వహణ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూస్తున్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, బోసురాజు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు.
మరుసటి రోజు సీతక్క, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ రామాంజనేయులు, కోదండరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, శ్రవణ్ దాసోజు, బలరాం నాయక్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మన్నే సతీష్ తదితరులు ప్రసంగిస్తారు.
Also Read :