Congress Protest : ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిపిసిసి పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గo రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో జిల్లా కేంద్రంలో వేలాదిమంది రైతులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని, వరి వేయని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలు, రైతులు, పార్టీ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై నాయకులు, రైతులు మండిపడ్డారు.
ఈసందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడంలేదని నెపం చూపుతూ కేసీఆర్ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైతులను ఇబ్బంది పెట్టడం మంచిదికాదాన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ మద్య 20 కిలోల నూక వస్తుందని నూక కిలోకు 15 రూపాయల చొప్పున క్వింటాలుకు 300 రూపాయలు కాగా రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 15 వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రైతులకోసం భరించలేవా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్ రైతులను ఆదుకోవడానికి చేతులెతేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలోనీ జంతర్ మంథర్ వద్ద కాకుండా రాష్ట్ర విశ్రాంతి భవనమైన తెలంగాణ భవన్ లో ఏసీలు, కూలర్లు పెట్టి రైతుల కోసమని ధర్నాలు చేయడమేమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.రైతుబంధు పేరు చెప్పి రైతులకు రావాల్సిన బ్యాంక్ రుణాలు, విత్తన, ఉద్యనవన శాఖ, వ్యవసాయ శాఖ నుంచి రావాల్సిన రాయితీలను ప్రభుత్వం ఎత్తివేసిందని ఇదేనా రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ప్రేమా అని నీలాదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి దేవందర్ రెడ్డి,గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళేపెల్లి దుర్గయ్య, ఎంపిపి మసర్థి రమేష్, కౌన్సిలర్లు నక్క జీవన్, కాంగ్రెస్ నేతలు దేవేందర్ రెడ్డి,గాజంగి నందయ్య, బండ శంకర్,మన్సూర్అలీ, నేహాల్, కొండ్ర రామచంద్ర రెడ్డి, రవీందర్ రావు, జున్ను రాజేందర్, గంగాధర్,రమేష్ రావు, కమాటాల శ్రీనివాస్, పరీక్షిత్ రెడ్డి, గంగా రెడ్డి,శంకర్హ,రీష్, గుండా మధు, గోపు మాధవి, అల్లాల సరిత, బింగి సుమ, చిట్ల లత, రజిత, నరేష్, గంగాధర్, మొగిలి, రజినీకాంత్, మహిపాల్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : మోదీకి 24 గంటల డెడ్‌లైన్..సిఎం కెసిఆర్